నల్లేరు – ఔషధ గుణాలు

నల్లేరు ఒక మందమైన తీగ జాతి మొక్క. ఇది విపరీతమైన దురదను కలిగి ఉంటుంది. ఎముకలకు మంచి శక్తిని కలుగ చేస్తుంది. గుండెకు మంచి రక్త ప్రసరణను తోడ్పడుతుంది. నల్లెరును ఒక స్టెరాయిడ్ అని అంటారు. రక్త స్రావం కాకుండా ఆపుతుంది. కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. నల్లేరును నార తీసి ముక్కలుగా కోసి సున్నపు నీటిలో వేసినా, లేక చింత పండు రసంలో వేసినా దురదలు తగ్గుతాయి. కోసి ఉంచిన ముక్కలను నేతిలో లేక నువ్వుల నూనెలో వేయించి చింత పండు వేసి మిక్సీ చేసి పచ్చడిగా తయారు చేసి తింటే గుల్ల బారిన ఎముకలు గట్టి పడుతాయి. ఇది ఆస్టియో పోరోసిస్ కు మంచి మందు. దీనిని పులుసు కూరగా తిన వచ్చు.
నల్లేరు శరీరంలో కఫాన్ని రానివ్వదు. దగ్గు, జ్వరాలకు మంచి మందు. నల్లెరును ముక్కలుగా కోసి చింత పండుతో కడిగి నేతిలో వేయించి దంచిన ముద్దను నీటిలో వేసి మరిగించి చల్లార్చి తాగితే రక్త మొలలు వెంటనే తగ్గి పోతాయి. దీనికి రక్తాన్ని గడ్డ కట్టించి గుణం వుంది. నల్లెరును కషాయంగా కాచి శొంఠి, మిరియాలు, కలిపి తాగితే ఉదర సమస్యలు తగ్గి పోతాయి. శరీరంలో వాపులు వస్తే నల్లేరు రసం తీసి కొద్దిగా నిమ్మ రసం + ఉప్పు + చింతపండు రసం కలిపి వాపులపై లేపనంగా రాస్తే వాపులు తగ్గి పోతాయి. నల్లేరు కూరగాయల మార్కెట్ లో లభించదు, కానీ ఆయుర్వేద షాపుల్లో దీని పొడి అమ్ముతున్నారు. నల్లేరు పొడిని పాలల్లో వేసి చక్కర వేసి తాజాగా వచ్చు. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే మనకు ఎముకలకు సంబంధించిన రుగ్మతలను రానివ్వడు. నల్లేరు మొక్కను ఇంట్లో పెంచుకుని వాడుకోవడం మంచిది ఇది త్వరగా పెరిగే మొక్క.
-పి.కమలాకర్ రావు