పేద‌ల ఉసురు మంచిది కాదు.. ఎంపి ఈట‌ల‌ రాజేంద‌ర్

హైద‌రాబాద్ (CLiC2NEWS): మూసీ ప్ర‌క్షాళ‌న‌కు మేం వ్య‌తిరేకం కాద‌ని, డ్రైనేజి నీరు మూసీలో క‌ల‌వ‌కుండా చూడండ‌ని మ‌ల్కాజిగిరి ఎంపి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. మూసీ విష‌యంలో ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును బిజెపి ఖండిస్తోంద‌ని, బిజెపి ఎపుడూ పేద‌ల ప‌క్ష‌నే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. డిపిఆర్ లేకుండా మార్కింగ్ ఎట్లా చేస్తావ‌ని సిఎం రేవంత్ రెడ్డిని ఆయ‌న ప్ర‌శ్నించారు. నిన్ను ఎన్న‌కున్నందుకు పేద‌ల బ‌తుకు ఇట్లా ఆగం చేస్తావా.. అని గ‌త ప్ర‌భుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరిట క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చేసిందన్నారు. వాటిని బిఆర్ ఎస్ స్థిరాస్తి వ్యాపారులు పేద‌ల‌కు విక్ర‌యించారు, మ‌ళ్లీ ఇపుడు ఆ పార్టీ నేత‌లే మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌న్నారు.

మూసీలో విష రసాయ‌నాలు కలుస్తున్నాయని.. వాటిని అరిక‌ట్టి డైవ‌ర్ష‌న్ చెయ్యాల‌న్నారు. చెరువుల‌న్నీ ముందు క్లీన్ చేయండి అని.. ఎక్క‌డైనా ఎస్‌టిపిలు ప‌నిచేస్తున్నాయా అని ప్ర‌శ్నించారు. గ‌త సిఎం హుస్సేన్ సాగ‌ర్‌ను ఎందుకు బాగు చేయ‌లేదు. స‌చివాల‌యం బ‌ఫ‌ర్ జోన్‌లో క‌ట్ట‌లేదా అని ప్ర‌శ్నించారు. పేద‌ల ఉసురు మంచిది కాదు.. బుల్టోజ‌ర్‌ల‌కు అడ్డంగా ప‌డుకుంటామ‌న్నారు. రేపు జ‌ర‌గ‌బోయే మ‌హాధ‌ర్నాకు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున రావాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.