తెలంగాణలో మయోనైజ్‌పై నిషేధం..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లలో విరివిగా వినియోగించే మయోనైజ్‌పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. మయోనైజ్‌ను మండి బిర్యాని, పిజ్జాలు, శాండ్విచ్లు, కబాబ్‌లు ఇతరత్రా ఆహార పదార్థాల్లో వాడుతుంటారు. ఆ పదార్దాన్ని నిషేంధించేందుకు నిర్ణయం తీసుకుంది.
పుడ్ సేప్టి విభాగం అధికారుతో నిర్వహించిన సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిర్ణయం తీసుకున్నారు. హోటళ్లు, పుడ్స్టాళ్లలో తనిఖీలు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. కల్తీ ఆహారం తిని ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.