ప్రైవేట్ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి

మదనపల్లి: చిత్తూరు జిల్లాలో మదనపల్లి – పుంగనూరు మార్గమధ్యలోని బండకిందపల్లి వద్ద జ్యూస్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్లా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 20 మందికి పైగా ప్రయాణికులు మదనపల్లె మండలంలోని అడవిపల్లి గ్రామానికి చెందినవారు. బస్సు అడవిపల్లి గ్రామ సమీపంలోకి రాగానే జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద రాళ్లను ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మండలంలోని ఎర్రబల్లికి చెందిన గంగులప్ప (65), బండకడపల్లికి చెందిన సోమునాయుడు (19), అడవిపల్లికి చెందిన మల్లికార్జున (29) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మదనపల్లె గ్రామీణ పోలీసులు తెలిపారు.
తప్పకచదవండి: రైలు కిందపడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
[…] […]