మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులకు అస్వస్థత

మాగనూరు (CLiC2NEWS): మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నారాయణపేట్ జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో చోటుచేసుకుంది. బుధవారం మధ్యహ్నం భోజనం చేసిన విద్యార్థులలో కొంతమందికి అకస్మాత్తుగా వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో కొంతమంది కోలుకోవడంతో ఇంటికి పంపించారు. మరో 9 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు విద్యార్థుల ఆరోగ్య పరిస్తితిపై ఆందోళన చెందుతున్నారు.