మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించిన ఖ‌ర్గే..

ఢిల్లీ (CLiC2NEWS): మ‌హారాష్ట్రలో మ‌హాయ‌తి కూట‌మి 233 స్థానాల్లో విజ‌య ప‌తాకం ఎగురువేసింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష‌డు మ‌ల్లికార్జున ఖ‌ర్గే స్పందించారు. ఇలాంటి ఫ‌లితాల‌ను తాము ఊహించ‌లేద‌ని.. కార‌ణాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. ఛ‌త్ర‌ప‌తి శివాజి, అంబేడ్క‌ర్ సిద్దాంతాల‌కు తాము నిజ‌మైన ప్ర‌తినిధుల‌మ‌ని,త‌మ పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌న్నారు. అదేవిధంగా ఝార్ఖండ్ ప్ర‌జ‌లు విభ‌జ‌నవాద‌, న‌కిలీ రాజ‌కీయాల‌ను తిర‌స్క‌రించార‌న్నారు. ఝార్ఖండ్‌లో జ‌వాబుదారీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఖ‌ర్గే తెలిపారు.

మ‌హారాష్ట్రలో మ‌హాయ‌తి కూట‌మి 233స్థానాల్లో విజ‌యం సాధించింది. ఎంవిఎ 51 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. ఝార్ఖండ్‌లో జెఎంఎం 34 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా.. బిజెపి 21, కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకుంది. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాల‌కు జెఎంఎం+కు 56 సీట్లు వ‌చ్చాయి. బిజెపి+కు 24 స్థానాల్లో గెలుపొందింది.

Leave A Reply

Your email address will not be published.