త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్: కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ (CLiC2NEWS): ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదలకంటే ధనికులే ఎక్కువగా ఉన్నారని.. సంపన్నులే ప్రభుత్వ స్థాలాలను ఆక్రమిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బేగంపేటలోని బయోడైవర్సిటి అథారిటి, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. లోటస్ పాండ్లో ఓ వ్యక్తి ఎకరం స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే.. హైడ్రా అడ్డుకుందన్నారు. హైడ్ర చర్యలకు ప్రభత్వం పూర్తి సహాకారం అందిస్తుందని, చెరువుల పరిరక్షణ, పునరుద్దరణ చర్యలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు కమిషనర్ వెల్లడించారు.
దాదాపు అన్ని రాజకీయ పార్టీల వారు ఆక్రమణల్లో ఉన్నారన్న ఆయన.. ఎక్కువగా సంపన్నులే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని రంగనాథ్ ఈ సందర్బంగా తెలిపారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎవరినీ వదిలేది లేదని.. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.