హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో బుల్లితెర నటి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబైలి శ్రీరాంగనర్ కాలనీలో కన్నడ బుల్లితెర నటి శోభిత భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆమెకు గతేడాది వివాహం జరిగింది. బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్‌తో పాటు పలు నినిమాల్లొ శోభిత నటించారు. ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.