మెగాస్టార్ సినిమాకి సమర్పకుడిగా నాని..

హైదరాబాద్ (CLiC2NEWS): ‘దసారా’ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా ఓ చిత్రం పట్టాలెక్కబోతుంది. ఈ చిత్రానికి సమర్పకుడిగా నేచరుల్ స్టార్ నాని వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మెగాస్టార్ సినిమాల కోసం గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి చూశానని, ఆఖరికి నా సైకిల్ కూడా పోయింది. ఆయన మాకొక వేడుక.. ఇప్పుడు ఆయన్నే మీ ముందుకు తీసుకొస్తున్నా. మెగాస్టార్ చిరుని మరింత కొత్తగా చూపించడానికి మేమెంతో వేచి చూస్తున్నామని .. అది దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కల సాకారం కానుందని నాని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.