రైతుల కోసం ధరణి కొత్త యాప్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. కమిటి నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్ను ఏవిధంగా ప్రక్షాళన చేయాలో యోచన చేస్తున్నట్లు తెలిపారు. మా ప్రభుత్వం వచ్చిన తనకవార ధరణిలో కొన్ని మార్పులు చేశామని.. రైతులకు మంచి జరిగే ప్రతి సూచననూ స్వీకరిస్తామన్నారు. పోర్ట్ ల్ నిర్వహణను డిసెంబర్ ఒకటో తేదీ నుండి విదేశీ సంస్థ నుండి ఎన్ఐసికి మార్చామని వెల్లడించారు.