డిసిఎం వ్యానులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
భోగాపురం (CLiC2NEWS): డిసిఎం వ్యానును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం నారులేట పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డిసిఎం వ్యాన్ ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగి వ్యానులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వ్యాను మంటల్లో ఇరుక్కుపోయిన క్లీనర్ షరీఫ్ సజీవ దహనయ్యాడు. షరీఫ్ .. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందినట్లు సమాచారం.