ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య

పెద్దపల్లి (CLiC2NEWS): ఇటుక బట్టిల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా *వర్క్ సైట్ స్కూల్* పేరుతో పాఠశాలలు రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ప్రారంభించినట్లుఐపిఎస్., ఐజి పేర్కొన్నారు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ‌ర్క్ సైట్ స్కూల్ పేరుతో పాఠ‌శాల‌ల‌ను రామ‌గుండం సిపి శుక్ర‌వారం ప్రారంభించారు. ఇటుక బట్టిల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా *వర్క్ సైట్ స్కూల్* పేరుతో పాఠశాలల‌ను ప్రారంభించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇటుక బట్టీలలో పలక బలపం పట్టవల్సిన చీట్టి చేతులు ఇటుక బట్టీలలో తల్లితండ్రులతో కలిసి ఇటుకలను చేస్తూ, మోస్తున్న కార్మికుల పిల్లల పరిస్థితి తెలిసి ఇటుక బట్టి యజమానులతో మాట్లాడి కార్మికుల బాగోవులు చూడడంతో పాటు వారి పిల్లలను కార్మికులుగా మార్చవద్దన్నారు. వారికి విద్యాభ్యాసం కల్పించాల్సిందేనని ముఖ్య ఉద్దేశ్యంతో వర్క్ సైట్ స్కూల్ క్లాస్ రూములను ఏర్పాటు చేశారు.పిల్లల భవిష్యత్తు కోసం పోలీస్ శాఖ నుండి తమ వంతు సహకారం అందిస్తామని చిన్నారులకు నాణ్యమైన విద్య అందించాలని సదుద్దేశంతో ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ఏర్పాటు చేసినట్లు సిపి గారు తెలిపారు. ఇక్కడ 70 మంది పిల్లలు ఉన్నారు వాళ్లకి ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒరిస్సా భాషలో నేర్పించడానికి ఒరిస్సా నుంచి టీచర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని ఇటుక బట్టిలలో త్వరలో *వర్క్ సైట్ స్కూల్* ఏర్పాటు చేసేలా చూస్తామ‌ని సిపి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్., పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, బసంత్ నగర్ ఎస్సై స్వామి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.