రానున్న 12 గంటల్లో ఎపిలో పలుచోట్ల భారీ వర్షాలు..!
అమరావతి (CLiC2NEWS): రానున్న 12 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఈ క్రమంలో ఉత్తర కోస్తా సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ శాక వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఎపిలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నట్లు సమాచారం.