‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధర పెంపుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ (CLiC2NEWS): ‘గేమ్ ఛేంజర్’ సినమా టికెట్ ధరల పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదల రోజు.. 10 వ తేదీన ఉదయం 4 గంటల నుండి 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. 11 నుండి 19వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్ లో రూ.50, మల్టి ప్రెక్సుల్లో రూ. 100 పెంచుకునేందుఉ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్‌షోకు అనుమతి లభించలేదు.