సిఎం వ‌చ్చేవ‌ర‌కు కూల్చివేత‌లు ఆపండి: ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌

ఖైర‌తాబాద్ (CLiC2NEWS): పొట్ట‌కూటి కోసం వ‌చ్చి.. జీవ‌నం సాగిస్తున్న పేద‌వారిపై దౌర్జ‌న్యం చేయ‌డం ఆపండ‌ని అధికారుల‌పై ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ మండిప‌డ్డారు. ఖైరతాబాద్ చింత‌ల్ బ‌స్తీలో  షాద‌న్ కాలేజ్ ఎదురుగా పుట్‌పాత్‌పై ఆక్ర‌మ‌ణ‌ల‌ను బ‌ల్డియా, ట్రాఫిక్ పోలీసులు క‌లిసి కూల్చివేస్తున్నారు. విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ హుటాహుటిన అక్క‌డ‌కు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టి కి తీసుకురాకుండా ఎలా కూల్చి వేస్తారంటూ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సింఎ వ‌చ్చే వ‌ర‌కు కూల్చివేత‌లు ఆపాల‌ని అధికారుల‌ను కోరారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబ‌డులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ ప‌ర్య‌ట‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. కూల్చి వేత‌లు ఆప‌క‌పోతే అక్క‌డే బైఠాయించి ఆందోళ‌న చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.