ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు జైలు శిక్ష!
ముంబయి (CLiC2NEWS): ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ముంబయి కోర్టు జైలు శిక్ష విధించింది. 2018లో చెక్‌బౌన్స్ కోసుకు సంబంధించి అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు వర్మపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి రూ.3.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2018 లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి రామ్‌గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసును వేశారు.