నగరంలో గంజాయి చాక్లెట్లు.. కూకట్పల్లి టీ స్టాల్లో విక్రయం..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అధికారులు గురువారం వీటిని గుర్తించారు. రాజస్థాన్ నుండి కూకట్పల్లికి తరలిస్తుండగా వీటిని పట్టుకున్నారు. కూకట్పల్లి ప్రాంతంలోని ఓ టి స్టాల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతానికి చాక్లెట్లు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన గోర్ సాహాను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి దాదాపు రూ.2 లక్షల విలువ గల 24 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.