పురుగుల మందు తాగిన ప్రేమజంట మృతి

వికారాబాద్: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. ప్రేమికులిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీరని శోకంలో మునిగిపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలివి.. మల్రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన బాలిక (16), బాలరాజ్ (22) కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇరువురి ఇళ్లల్లో తెలిసిపోయింది. దీంతో భయాందోళన చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. కీర్తన అక్కడిక్కడే మృతి చెందగా.. హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో బాల్రాజ్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. క్షణికావేశంలో ఇద్దరు తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది.