దేశ రాజ‌ధాని ఢిల్లీలో ముగిసిన పోలింగ్

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజ‌ధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నిక‌లు బుధ‌వారం ప్ర‌శాంతంగా జ‌రిగాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల‌కు గాను నేడు పోలింగ్ నిర్వ‌హించారు. ఉద‌యం ఏడు గంట‌ల‌కు మొద‌లైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 57.70 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు స‌మాచారం. ఈ మేరకు ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించింది. ఈ ఎన్నిక‌ల్లో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము, ఢిల్లీ సిఎం ఆతిశి, కేంద్ర విదేశాంగ మంత్రి జై శంక‌ర్‌, కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్‌, కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ ప‌లువురు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు త‌మిళ‌నాడులోని ఈరోడ్ ( ఈస్ట్‌), యుపిలోని మిల్కిపుర్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఇవికెఎస్ ఇళంగోవ‌న్ మృతి చెంద‌డంతో అక్క‌డ ఉప ఎన్నికలు నిర్వ‌హించాల్సి వ‌చ్చింది.

 

Leave A Reply

Your email address will not be published.