ముగిసిన అమెరికా పర్యటన.. భారత్‌కు పయనమైన ప్రధాని మోడీ..
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/PM-MODI-AND-TRUMP.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. పర్యటనను ముగించుకొని తిరిగి భారత్‌కు పయనమయ్యారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తో మోడీ భోటీ అయ్యారు. ఇరు దేశాల ప్రతినిధుల సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల పరస్పర వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణబంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సమావేశానంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెండు దేశాల నేతలు మాట్లాడారు.
భారత్‌కు ఈ ఏడాది నుండి మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతున్నట్లు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుందని.. భారత్‌కు ఎఫ్-35 యుద్ద విమానాలను కూడా విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఏదాశానికి లేనివిధంగా అమెరికాలో ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయని..అవి భారత్‌కు అవసరమన్నారు. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే దేశాలకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఉదాహరణకు భారత్ నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సగటును 3% సుంకాలను విధిస్తోంది. భారత్ 9.5 % సుంకాలను విధిస్తోంది.
ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆత్మీయ ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్బంగా ట్రంప్.. తాను స్వయంగా రాసిన ‘అవర్ జర్నీ టుగెదర్’ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకంపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ .. యు ఆర్ గ్రేట్ అని రాసి ట్రంప్ సంతకం చేశారు. దీనిలో ట్రంప్ మొదటిసారిగా దేశాధ్యక్షుడు గా ఉన్నపుడు కీలక సందర్భాలు, ఈవెంట్లతో కూడిన ఫోటోస్ ఉన్నాయి. 2019 ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో నిర్వహించిన హౌడీ మోడీ.. 2020లో ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చినప్పటి ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాలకు సంబంధింన ఫోటోలు ఉన్నాయి. ఫొటోలు మోడీకి చూపించారు. అనంతరం మీడియా సమావేశంలో ఒకరిపై ఒకరికి ఉన్న స్నేహాన్ని చాటుకున్నారు. భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా.. చాలా కాలం నుండి ఆయన నాకు మంచి స్నేహితుడు. మా మధ్య మంచి అనుంబంధం ఉందన్నారు. మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తామని ట్రంప్ తెలిపారు. దేశాలుగా భారత్, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యమన్నారు.