విశాఖలో కెరీర్ ఫెయిర్.. 49 కంపెనీలు, 10 వేల ఉద్యోగాలు..

విశాఖ (CLiC2NEWS): 49 అగ్రశ్రేణి ఐటి, ఐటి ఆధారిత కంపెనీలలో యువతకు పది వేల ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంగా విశాఖలో కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. మార్చి 5, 6 తేదీల్లో గీతం వర్సిటీ వేదికగా ఈ అతి పెద్ద కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఎపి ఉన్నత విద్యా మండలి, ఎపి నైపుణ్యాభివృద్ది సంస్థతో కలిసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాప్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) ఈ మేళాను నిర్వహించనుంది. దీనిలో భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం సాయంత్రం మంత్రి విడుదల చేశారు.
2004, 2025 పాస్ అవుట్ (టెక్, ఆర్ట్స్ సైన్స్ , ఐటిఐ, పాలిటెక్నిక్ అండ్ డిప్లొమా) విద్యార్థులు ఈ కెరీర్ ఫెయిర్‌లో పాల్గొనేందుకు అర్హులు. మార్చి 3లోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ప్రతిపదికగా ఈ మేళా కొనసాగుతుంది. అభ్యర్థులు దీనిని వినియోగించుకోగలరని.. మిస్ చేసుకోవద్దని మంత్రి సూచించారు.