సిఐఎస్ఎఫ్ లో 1161 కానిస్టేబుల్ / ట్రేడ్స్‌మెన్ పోస్టులు

CISF: సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటి ఫోర్స్ (సిఐఎస్ఎఫ్)  వివిధ సెక్టార‌ల్లో మొత్తం 1161 కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఎల‌క్ట్రీషియ‌న్‌, కార్పెంట‌ర్‌, వెల్డ‌ర్‌, బార్బ‌ర్‌, టైల‌ర్ పెయింట‌ర్‌, స్వీప‌ర్ .. త‌దిత‌ర సెక్టార్ల‌లో కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. మెట్రిక్యూలేష‌న్ లేదా త‌త్స‌మాన విద్యార్హ‌త క‌లిగిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ ఏడాది ఆగ‌స్టు 1వ తేదీ నాటికి అభ్య‌ర్థులు 18 నుండి 23 ఏళ్లు ఉండాలి.

అభ్య‌ర్థుల‌ను కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష , ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 21,700 నుండి రూ.69,100 వ‌ర‌కు ఉంటుంది.

అభ్య‌ర్థుల‌కు ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ట్రేడ్ టెస్ట్‌, రాత ప‌రీక్ష‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ , రివ్యూ మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ కూడా ఉంటుంది. అభ్య‌ర్థుల ఎత్తు క‌నీసం 165 సెంటీమీట‌ర్లు.. ఛాతీ 78-83 సెంటీ మీట‌ర్ల శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.

అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులను మార్చి 5 నుండి ఏప్రిల్ 3వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తుల ఫీజు రూ.100 గా నిర్ణయించారు. ఎస్‌సి/ ఎస్‌టి, ఇఎస్ ఎంల‌కు ఫీజు లేదు. ప‌రీక్ష తేదీ, సిల‌బ‌స్, ప‌రీక్ష‌కేంద్రాలు ..త‌దిత‌ర పూర్తి వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://cisfrectt.cisf.gov.in/వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.