రాష్ట్ర మహిళా కమిషన్‌కు గాయని కల్పన ఫిర్యాదు

హైదరాబాద్ (CLiC2NEWS): సినీ గాయని కల్పన రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. వాస్తవాలు తెలుసుకోకుండా తన గురించి అసత్య పోస్టులు పెడుతున్నారని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల గాయని కల్పన అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరారు. ఆమె కోలుకున్న తర్వాత మాట్లాడుతూ.. తాను ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదన్నారు. నిద్రమాత్రల మోతాదు అధికం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు.
ఈ క్రమంలో పలు యూట్యూబ్ ఛానెళ్లు కల్పన ఆత్మహత్యాయత్నం చేశారంటూ వార్తలు రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె శనివారం తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనపై అసత్య వార్తలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ ఛైర్‌పర్సన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.