నగరంలోని కోకాపేటలో అగ్నిప్రమాదం.. ఐటి ఉద్యోగులకు గాయాలు

హైదరాబాద్ (CLIC2NEWS): కోకాపేటలోని ఓ భవనంలో మంటలు వ్యాపించి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐటి ఉద్యోగులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. స్థానిక జిఎఆర్ భవనంలో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన ఆరుగరు ఐటి ఉద్యోగులను సమీపంలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియరాలేదు.