మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు కరోనా

హైదరాబాద్‌ : తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరోనా బాడిన సంగతి తెలిసిందే. తాజాగా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కరోనా పాజటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తనకు కొవిడ్‌ రిపోర్ట్‌లో పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, తన సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.

 

Leave A Reply

Your email address will not be published.