ఫ్యాన్సీ నెంబర్లతో రాష్ట్ర రవాణా శాఖకు భారీ ఆదాయం..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లతో భారీ ఆదాయం చేకూరింది. శనివారం ఒక్కరోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఖైరతాబాద్ ఆర్టిఎ కార్యాలయం వెల్లడించింది. టిజి 09 ఎఫ్ 0001 నంబర్‌ను రూ.7.75లక్షలకు సినీనటుడు , ఎమ్మెల్యే బాలకృష్ణ సొంతచేసుకున్నారు. కమలయ్యా హై సాప్ట్ సంస్థ 0009 నంబరును దక్కించుకున్నారు. ఇక 9999 నంబర్‌ను ఇకో డిజైన్ స్టూడియో రూ.99,999 కి దక్కించుకున్నట్లు సమాచారం.