AP: మాజి ఎంపి ఆస్తుల వేలం దిశగా అడుగులు..

క‌ర్నూలు (CLiC2NEWS): వైఎస్ ఆర్ పార్టి మాజి ఎంపి బుట్టా రేణుకకు సంబంధించిన ఆస్తుల వేలం వేయాల‌ని ప్ర‌భుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ ఐసికి చెందిన ఎల్ ఐసి హెచ్ ఎఫ్ ఎల్ కోరుతున్నారు. ఈ సంస్థ నుండి మాజి ఎంపి రేణుక దంప‌తులు.. 2018వ సంవ‌త్స‌రంలో 15 ఏళ్ల కాల వ్య‌వ‌ధిలో తిరిగి చెల్లించేలా రూ.310 కోట్లు అప్పు తీసుకున్నారు. సుమారు రూ.40 కోట్ల వ‌ర‌కు తిరిగి చెల్లించారు. అనంత‌రం ఐదేళ్ల నుండి ఎలాంటి చెల్లింపులు జ‌ర‌గ‌లేదు. ప‌లుసార్లు నోటీసులు పంపి, సంప్ర‌దింపులు జ‌రిపిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేదు. అస‌లు వ‌డ్డీతో క‌లిపి రూ.340 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో ఆస్తులు విక్ర‌యించి రుణం రీషెడ్యూల్ చేయాల‌ని సంస్థ కోరింది.

బుట్టా ఎన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్‌, బుట్టా క‌న్వెన్ష‌న్ స‌ర్వీసెస్‌, లిమిటిడ్‌, మెరిడియ‌న్ ఎడ్యుటెక్ స‌ర్వీసెస్ కార్య‌క‌లాపాల‌కు బుట్టా రేణుక ఈ రుణాన్ని వినియోగించారు. తీసుకున్న మొత్తానికి నెల‌స‌రి వాయిదా రూ.3.40కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది. రుణం చెల్లించ‌డం ఆపేయడంతో హెచ్ ఎఫ్ ఎల్‌.. ఎన్‌సిఎల్‌టిని ఆశ్ర‌యించింది. ప్ర‌స్తుతం కేసు పెండింగ్‌లో ఉంది.

 

Leave A Reply

Your email address will not be published.