దీపావ‌ళి బానాసంచాపై ఢిల్లీ నిషేధం

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీపావ‌ళి ట‌పాకాయ‌ల‌పై నిషేధం విధించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సిఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. దేశ రాజధానిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని, విషపూరిత గాలి మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేయడానికే ఈ నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున లక్ష్మి పూజను నిర్వహిస్తామని, దానిని లైవ్ టెలికాస్ట్ చేస్తామని, అందులో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టపాకాయలు కాల్చమన్న ప్రతిజ్ఞ తీసుకోవాలి. గత యేడాది అందరమూ కలిసి సెంట్రల్ పార్కులో ప్రభుత్వం తరపున మెగా లైట్, సౌండ్ షోలో పాల్గొన్నాం. ఈసారి కూడా 2 కోట్ల మంది కలిసే జరుపుకుందాం. కానీ… ఈసారి లక్ష్మిపూజను నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమం 7:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. బయటకు వెళ్లి టపాకాయలు పేల్చకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. కాలుష్యాన్ని నియంత్రిద్దాం.’’ అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

(ఆ సమయంలోనే ట‌పాకాయ‌లు కాల్చండి: హైదరాబాద్ సీపీ)

1 Comment
  1. […] దీపావ‌ళి బానాసంచాపై ఢిల్లీ నిషేధం […]

Leave A Reply

Your email address will not be published.