ఎమ్మెల్యే అభ్యర్థిపై కాల్పులు కలకలం

పట్నా: ఎన్నికల వేల బిహార్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. మూడో విడత అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో హయ్‌గ్ఘ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న రవీంద్రనాథ్ అలియాస్ చింటూ సింగ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున దర్భంగా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. తుపాకీ తుటాలకు గురైన అభ్యర్థి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, దర్భాంగా మెడికల్ కాలేజీల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నామని స్థానిక ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.