చాదర్‌ఘాట్ లో 75 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని చాదర్‌ఘాట్ పరిధిలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 75 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.50లక్షల నగదు దుండగులు దోచుకెళ్లినట్లు సమాచారం. ఫహిముద్దీన్ అనే వ్యాపారి భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఫహిముద్దీన్ తన తల్లిదండ్రులను ఇంట్లో ఉంచి, తాను ఆస్పత్రికి వెళ్లాడు. ఇది తెలుసుకున్న దుండగులు ఇంటి వెనుక నుండి లోపలికి ప్రవేశించి.. తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి తాళంవేసి, ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. శనివారం ఉదయం ఫహిముద్దీన్ ఇంటికి తిరిగివచ్చి చూడగా దొంగతనం జరిగనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.