మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తప్పిన ప్రమాదం

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ప్రమాదం తప్పింది. దాదాపు అరగంటసేపు మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. దీంతో అలెర్టయిన సిబ్బంది.. తీవ్రంగా శ్రమించడంతో 30 నిమిషాల తర్వాత లిఫ్ట్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే… శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సైఫాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ..కిందకి దిగేందుకు అక్కడి లిఫ్ట్‌లోకి ఎక్కారు. అయితే ఆ లిఫ్ట్ మధ్యలో సడన్‌గా ఆగిపోయింది. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో… దాదాపు 30 నిమిషాలు తర్వాత లిఫ్ట్ లాక్ ఓపెన్ అయింది. దీంతో మంత్రి సేఫ్‌గా బయటకు వచ్చారు.