ఆదర్శ మహిళా శాస్త్రవేత్త మేరీక్యూరీ
ఈరోజు ఆమె పుట్టినరోజు.. పోలండ్‌లో 07.11.1867లో జన్మించారు
రెండు సార్లు నోబెల్ బహుమతి పొందిన మేరీక్యూరీ తన అద్వితీయ ప్రతిభాపాటవాలతో రేడియంను కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త . రెండు శాస్త్రాల్లో నోబెల్ బహుమతి అందుకున్న అరుదైన ఘనత అమెకే దక్కింది. 1903 ఫిజిక్స్‌లోను, 1911లో కెమిస్ట్రీలోను నోబెల్ బహుమతులు పొంది సరికొత్త చరిత్రను సృష్టించింది. 1867లో ఒక బానిస దేశంగా ఉన్న పోలండ్ లో ఒక సామాస్య కుటుంబలో జన్మించింది మేరీక్యూరీ.
బాల్యంలో ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తించబడినా పేదరికం వల్ల అనేక సంవత్సరాలపాటు ధనికుల ఇండ్లలో పిల్లల్ని చూసే సహాయకురాలుగా పనిచేసింది .బాల్యంలో ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తించబడినా పేదరికం వల్ల అనేక సంవత్సరాలపాటు ధనికుల ఇండ్లలో పిల్లల్ని చూసే సహాయకురాలుగా పనిచేసింది . 24సంల వయస్సులో కొంత డబ్బు పోగుచేసుకొని ఆస్ట్రియాలోని క్రాకో యూనివర్సిటీలో చేరబోతే మహిళలు సైన్సు చదవడానికి కుదరదనే నెపంతో ఆమె అభ్యర్ధనను తిరస్కరించారు. అప్పుడు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు వెళ్లి అక్కడి సైన్స్ విద్యార్థినిగా చేరింది. చదువుపైనే మనసు కేంద్రీకరించి ప్రతిభావంతమైన విద్యార్థినిగా విజయం సాధించింది.
ఆమె తన భర్తతో కలిసి ప్రయోగాలు చేసి ‘పోలోనియం’ అనే కొత్త రేడియో ధార్మిక మూలకాన్ని కనుగొంది . మాతృదేశమైన ‘పోలెండ్’ మీద ప్రేమతో దానికి ‘పోలోనియం’ అని పేరు పెట్టింది.
సోబర్న్ యూనివర్సిటీ. రేడియం కనుగొనగానే దాన్ని వైద్యశాస్త్రంలో చికిత్స నిమిత్తం వాడడం ప్రారంభించారు. రేడియంపై రాయల్టి పొందే అవకాశము ఉన్నప్పటికీ వారు రాయల్టి పొందలేదు. తాము సాధించిన ఫలితాలు సమాజం కోసం ఉపయోగ పడాలన్న ఆశయంతో, తమకు రాయల్టిలు అక్కర్లేదని ఆ దంపతులు ప్రకటించారు.ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వ్యాధిగా పరిగణింపబడిన క్యాన్సర్ కు ఇది చక్కటి చికిత్సా విధానాన్ని కూడా అందించింది.
మేడమ్ క్యూరీ. రేడియో ధార్మిక పదార్థాలతో ప్రమాదం అని తెలిసి కూడా మేడమ్ క్యూరీ తన పరిశోధనలలో రేడియో ధార్మిక పదార్థాలతో అతి సమీపంగా ప్రయోగాలు చేయడం వలన ఆమెలోని తెల్లరక్తకణాలు దెబ్బతిని ఆమెను బ్లడ్ కేన్సర్ వచ్చింది. 1914 ప్రపంచ యుద్ధంలో మేరీక్యూరీ ఎక్స్‌రే పరిశోధనల వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. మేడమ్ క్యూరీ జూలై 4, 1934న మరణించారు. కేన్సర్ బారి నుండి ప్రపంచాన్ని రక్షించాలని ఆమె చేసిన ప్రయోగాలకు, ఆమె అందించిన స్ఫూర్తికి మరణం లేదు. రేడియం కనుగొనడం ద్వారా మానవజాతికి ఎనలేని సేవచేసిన క్యూరీ తన ప్రాణాలను కూడా రేడియం పరిశోధనకే అంకితం చేసింది . మేరీక్యూరీ జీవితం మహిళలకే కాకుండా సర్వ మానవాళికి స్ఫూర్తిదాయకం!
-రేగులపాటి రమ్య రావు