బైడెన్, హారిస్ లకు అభినందనలు : మోడీ

న్యూఢిల్లీ : అమెరికా 46వ అధ్యక్షునిగా బైడెన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. బిడెన్, హారిస్‌ల ద్వయానికి అభినందనలంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ”అద్భుతమైన విజయం సాధించిన బైడెన్‌కు అభినందనలు.. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మీ సహకారం ఎంతో అమూల్యమైనది. భారత్-అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని మోడీ ట్వీట్ చేశారు.
అలాగే బైడెన్‌తో కరచాలనం చేసిన ఫొటోను కూడా షేర్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలిచిన భారత సంతతి సెనేటర్ కమలాహారిస్‌కు కూడా మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ”అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన కమలా హారిస్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ విజయం చరిత్రాత్మకం. ఇది మీకే కాకుండా భారతీయ అమెరికన్లందరికీ గర్వకారణం. మీ మద్దతు, నాయకత్వంతో శక్తివంతమైన భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని నా నమ్మకం” అని మోడీ పేర్కొన్నారు.
Congratulations @JoeBiden on your spectacular victory! As the VP, your contribution to strengthening Indo-US relations was critical and invaluable. I look forward to working closely together once again to take India-US relations to greater heights. pic.twitter.com/yAOCEcs9bN
— Narendra Modi (@narendramodi) November 7, 2020