అద్వానీ.. అందరికి సజీవ స్ఫూర్తి: ప్రధాని

న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ అందరికి సజీవ స్ఫూర్తి అని ప్రధాని మోదీ అన్నారు. అద్వానీ 93వ పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ప్రధానితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ….. ‘‘అద్వానీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపాను. ఆయనతో సమయం గడపడం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. నాలాంటి కార్యకర్తకు అద్వానీ మార్గదర్శనం, మద్దతు చాలా అమూల్యమైనది. దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమూల్యం.’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
అద్వానీ ఓ సజీవ ప్రేరణ : మోదీ
‘పార్టీని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లిన, దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన అద్వానీ గారికి శుభాకాంక్షలు. పార్టీ కార్యకర్తలకు, దేశానికి ఆయన సజీవ ప్రేరణ. ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.
Went to Advani Ji’s residence to wish him on his birthday. It is always a delight to spend time with him. For Karyakartas like me, Advani Ji’s support and guidance remain invaluable. His contributions to nation building are immense. pic.twitter.com/RO5nedXpj4
— Narendra Modi (@narendramodi) November 8, 2020