ఎమ్మెల్సీగా పెన్మత్స ఏకగ్రీవం
ఎమ్మెల్సీగా పెన్మత్స ఏకగ్రీవం
అమరావతి: ఎమ్మెల్సీగా పెనుమత్స వరహా వెంకట సూర్యనారాయణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేసిన పెనుమత్స సూర్యనారాయణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి పి.వి.సుబ్బారెడ్డి ప్రకటించారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మరో నామినేషన్ దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. సూర్యనారాయణ రాజు తండ్రి, సీనియర్ రాజకీయ నేత పెనుమత్స సాంబశివరాజు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం అనంతరం సూర్యనారాయణ రాజుకు ఎంఎల్‌సి టిక్కెట్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో సురేష్ బాబు ఏకగ్రీవం అయ్యారని అధికారి ప్రకటించారు.
సురేష్‌బాబు గురించి..
- పేరు: పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు(సురేష్ బాబు)
- విద్యార్హత: బీడీఎస్(డెంటల్)
- వృత్తి: డెంటిస్ట్
- పుట్టిన తేది: 6.7.1966