తెలంగాణలో రూ.1350 కోట్లతో ఈస్టర్ పాలిమర్ కంపెనీ
తెలంగాణలో రూ.1350 కోట్లతో ఈస్టర్ పాలిమర్ కంపెనీ
హైదరాబాద్: ప్రగతిపథంలో తెలంగాణ దూసుకుపోతోంది. పలు కర్పొరేట్ కంపెనీలో తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనబరుస్తుఆన్నరు. రాష్ట్రంలో మరో కార్పొరేట్ కంపెనీ తమ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈస్టర్ ఫిల్మ్టెక్ లిమిటెడ్ సంస్థ 1350 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ప్యాకేజింగ్ ఫిల్మ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మంత్రి చెప్పారు. ఈస్టర్ ఫిల్మ్టెక్ సంస్థ చైర్మన్ అరవింద్ సింఘానియాతో మంత్రి కేటీఆర్ ఇవాళ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్టర్ కంపెనీ రాక పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తుంది. తొలి దశ కంపెనీ నిర్మాణం కోసం 500 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2022 మూడవ క్వార్టర్లో తొలి దశ పూర్తి కానున్నది. ఈ కంపెనీ ద్వారా స్థానికంగా 800 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్యాకేజింగ్ పరిశ్రమకు చెందిన పాలిమర్ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. 30 నుంచి 40 శాతం వరకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కంపెనీ నిర్మాణంతో ప్యాకేజింగ్ పరిశ్రమలో తెలంగాణకు ప్రత్యేక స్థానం వస్తుందని ఆ కంపెనీ చెప్పింది. తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాల వల్లే ఆ రాష్ట్రంలో కంపెనీ పెట్టేందుకు నిర్ణయించినట్లు ఈస్టర్ సంస్థ చైర్మన్ అరవింద్ సింఘానియా తెలిపారు.