ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయం

రామ‌గుండం సిపి వి సత్యనారాయణ

మంచిర్యాల‌: ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయం అని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. మంచిర్యాల జిల్లా మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోణి నర్సాపూర్ (బెజ్జాల) గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీసువారి ఆధ్వర్యంలో బుధ‌వారం నిర్వహించిన ఆదివాసీ గిరిజన 300 కుటుంబాలకు దుప్పట్ట్లు ,100 మంది పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, 25కేజీ బియ్యం (ప్రతి కుటుంబ నికి), చెప్పులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి హాజరైనారు. వారిని ఆదివాసిలు వారి సంప్రదాయ డప్పు వాయిద్యాలతో సంప్రదాయం స్వాగతం పలికారు.

ఏం. ఎల్. ఏ దుర్గం చిన్నయ్య గారు మాట్లాడుతూ…… ఈ గ్రామం ప్రజల కోరిక, ఈ ప్రజల తరుపున రామగుండం సిపిగారు అడిగిన రోడ్డు మార్గం నిర్మాణం కచ్చితంగా ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజా శ్రేయస్సు కోరకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చాలా పథకాల ద్వారా ప్రజలకు చేరువ కావడం జరుగుతుంది అన్నారు. ఈ ప్రాంతం పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలనీ అన్నారు. బెల్లంపల్లి ప్రాంతం పోలీస్ అధికారులు ప్రజల అవసరాలను తెలుసుకొని మంచి పనులు చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటు అందరి మన్ననలు పొందుతున్నారు అన్నారు. ఎలాంటి అవసరాలు, సమస్యలు ఉన్న తనను సంప్రదించవచ్చు అన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయం అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగు పడ్డాయని తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలన్నారు. గిరిజనుల శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని తమ పిల్లలు చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటుందని అదేవిధంగా ఆదివాసి గిరిజనుల పిల్లలు కూడా ఉన్నత విద్యనభ్యసించి జీవితంలో డాక్టర్, పోలీస్ వంటి వృత్తులు నిర్వహిస్తుంటే చూడాలని ఉంది అని అన్నారు. గిరిజనులకు ఎల్లవేళలా క్షేత్రస్థాయి పోలీస్ అధికారులు అందుబాటులో ఉండి వారికి ప్రతి విషయంలో తోడ్పాటును అందిస్తూ వారి ఉన్నతికి కృషిచేయాలని సూచించారు. గిరిజనులను విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించి వారి ఉన్నతికి తోడ్పడడానికి పోలీస్ శాఖ ఎల్లవేళల సంసిద్ధంగా ఉంటుంది అని తెలిపారు. ప్రభుత్వం అందించే వివిధ లబ్ధి కార్యక్రమాలను గిరిజనులకు చేర వేయడానికి పోలీస్ శాఖ ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో సంసిద్ధంగా ఉందని అన్నారు . గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారు కావున వారి ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు.ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా పోలీస్ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు . .

ఆదివాసులు అసాంఘిక శక్తులకు దూరముగా ఉండాలని ,గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపించిన ,పోలిసులకు తెలియచేయాలని అభివృద్ధివైపు అదివాసులు దృష్టిసారించాలని
మారుమూల గ్రామాలను సందర్శించి ప్రజలకు మరింత చైతన్య పరచాలని తెలిపారు
ముఖ్యంగా ఆదివాసి గిరిజన గ్రామాల్లో పర్యటించాలని, స్థానిక సమస్యలను తెలుసుకోని, వెంటనే పరిష్కరించే మార్గాన్ని అన్వేషించాలని సూచించారు.

ప్రజలకు కేవలం శాంతిభద్రతల సమస్య కాకుండా ఇతర సమస్యలున్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ సమస్యలు వివరించి నట్లయితే వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు .

ప్రజల కి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని, ప్రజలకు పోలీస్ మీకోసం ఉన్నారు అనే భరోసా కల్పించే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన డీసీపీ మంచిర్యాల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ రహెమాన్, తాండూర్ సీఐ బాబు రావు, మాదారం ఎస్ఐ మానస ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి టౌన్ సీఐ రాజు, రూరల్ సీఐ జగదీష్, ఎస్ఐ లు రాములు, శేఖర్ రెడ్డి, భాస్కర్, సమ్మయ్య, ప్రశాంత్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు,ప్రజలు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.