సిద్దిపేట, పెద్దపల్లికి స్వచ్ఛ అవార్డులు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం.. పం చాయతీరాజ్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌, స్వచ్ఛ భార త్‌ మిషన్‌కు సంబంధించి ఏటా వరుసగా పలు పురస్కారాలను అందుకుంటున్నది. నవంబర్‌ 19వ తేదీన ప్రపంచ టాయిలెట్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలోని తాగునీరు, పారిశుద్ధ్యశాఖ ఏటా మరుగుదొడ్లు, సాలిడ్‌, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో అవార్డులను అందిస్తున్నది. ఆయా విభాగాల్లో ఉత్తమ ప్రగతిని సాధించిన జిల్లాలను ఎంపిక చేస్తున్నది. తాజాగా దేశావ్యాప్తంగా 20 జిల్లాల ను ఎంపిక చేయగా తెలంగాణ నుంచి సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు పురస్కాలను దక్కించుకున్నాయి. ఈ నెల 19న జల్‌శక్తిశాఖ వర్చువల్‌ పద్ధతిలో ఈ అవార్డులను ప్రదా నం చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు కేంద్రప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ మహేశ్‌ ఠాకూర్‌ లేఖరాశారు.
స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద రాష్ట్రంనుంచి సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు జాతీయ అవార్డులకు ఎంపిక కావడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు.

Leave A Reply

Your email address will not be published.