ఏపీలో కొత్తగా 1056 కరోనా కేసులు

విజయవాడ: 24 గంటల వ్య‌వ‌ధిలో 53,215 న‌మూనాల‌ను ప‌రీక్షించ‌గా 1056 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 8,54,011 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనా 14 మంది మృతి చెందారు. ఈ మేర‌కు ఎపి ప్ర‌భుత్వం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. ఇప్పటివరకు కరోనాతో 6,868 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,659 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,28,484 మంది రివకరీ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 91.54 లక్షల కరోనా టెస్ట్‌లు చేశారు.

కరోనాతో అనంతపురం, చిత్తూరు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.