ఓ గోర‌టి… పేదల పెబ్బెవు నీవు..

నీవు గరీబోళ్ల ప్రతినిధివి
గల్లీ చిన్నదంటూ….
గరీబోళ్ల గొప్పతనం చెప్పిన గొప్పోనివి
గిచ్ఛన్న గిరిమల్లెలో అంటూపాడుతూ
ఎండి పోయిన దుందుభి అందాలు జగతికి ఎలుగెత్తి చాటిన రచనా గజపతివి…
తెలంగాణ యాస,గోస తెలిసినోనివి…
ప్రశ్నించే తత్వాన్ని ఎరిగినోనివి…
నీ గొంతు మూగబోదు
చెకుముకి రాయొలే రాపిడి చేస్తావు
మెప్పించి,ఒప్పించి సాధిస్తావ్..
వెంకన్నా ..నీ గళం,కలం పై ఎన్నోఆశాలు అన్నార్తులకు,అభాగ్యులకు చేయకు నిరాశ…
పెద్దల సభలో పెద్దవాడిగా మవునంగా వుండకు…
పేదల పెబ్బేగా ఉండు..
పది కాలలపాటు మా యాదిలో సల్లంగ ఉండు.

-ఎస్. వి.రమణా చారి

Leave A Reply

Your email address will not be published.