ప్రేమించే పెనిమిటి (షార్ట్ ఫిల్మ్‌ రివ్యూ)

స‌మీక్ష‌: “ప్రేమించే పెనిమిటి“
షార్ట్ ఫిల్మ్‌: “ప్రేమించే పెనిమిటి“
న‌టీన‌టులు: రామ్ మొగిలోజి, సీత మహా లక్ష్మి, హ‌నుమాన్ క‌న‌ప‌ర్తి, మ‌హ‌, బైర‌వ‌గోని భాస్క‌ర్ గౌడ్‌, న‌గునూర్‌.
మాట‌లు: మ‌నీష్ ముక్కెర‌
కెమెరా: మ‌హేష్ వేముల‌‌
కో- ఎడిటర్స్‌: మ‌హేష్ పాలోజి, కుమార్ స్వామి జంగ‌, రంజిత్ వేముల‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: రామ్ మొగిలోజి

 ఇటీవల కాలం లో కరీంనగర్ నుంచి లఘు చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి.. అయితే రాసి ఎక్కువగా వున్నా వాసి ఉండటం లేదు. ఎవరూ కథను, చిత్రీకరణను పట్టించు కోవడం లేదు. అందరూ రెట్టింపు ఉత్సాహం తో చిత్రాలు నిర్మిస్తున్నా చూడలేక పోతున్నాం. ఒక సందేశం ఉండదు. ఎందుకు తీస్తున్నారో అర్థం కాదు. భాష సరిగా ఉండదు.

కొందరికి వ్యక్తి గతంగా చెప్పినా పెట్టించుకుని మార్పులు చేయడానికి ప్రయత్నించరు. కరీంనగర్ కవులకు, రచయితలకు పుట్టినిల్లు. కానీ ఇలాంటి లఘు చిత్రాలు నిర్మించి చులకన అవుతున్నారు. సినిమా ఒక శక్తి వంతమైన మాధ్యమం కానీ దాన్ని ఉపయోగించుకునే నేర్పు కావాలి. ఇటీవల ఒక లఘు చిత్రం వచ్చింది దాని పేరు ప్రేమించే పెనిమిటి. అది రొమాంటిక్ ఫామిలీ షార్ట్ ఫిలిం అని వుంది.

బ‌లం:
+ సీతా మహా లక్ష్మి న‌ట‌న‌
+డైరెక్ష‌న్‌

బ‌ల‌హీన‌త‌లు
-క‌థ‌, మాట‌లు

భార్యను ప్రేమించే భర్త ఆమెకు అపకారం తలపెట్టడు. కానీ ఇందులో చీప్ ట్రిక్స్ తో ఆమెకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటివి ఉంటే వెగటుగా ఉంటుంది. ఇక నటీ నటుల ఎంపిక కూడా సరిగా ఉండటం లేదు. నటుల వయసు, మనో భావాలకు అనుగుణంగా పాత్రల ఎంపిక ఉంటే బాగుంటుంది. కానీ దొరికిన వారిని లేదా ఇతర కారణాలతో రాజీ పడి వారిని ఎంపిక చేయడం సరి కాదు. నిష్ణాతులతో రచనలు చేయించాలి. లేదా వారి అభిప్రాయం తెలుసుకోవాలి. లేకుంటే సమాజం లో చులకనై పోతారు. మై విల్లెజ్ షో, లేదా వరంగల్ వందన వంటి లఘు చిత్రాలు చూసి స్ఫూర్తి పొందాలి. ఒక్క సారి కరీంనగర్ శ్రేయోభిలాషిగా ఈ సూచనలు పాటిస్తే సంతోషిస్తా.

–టి . వేదాంత సూరి

గ‌మ‌నిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్రమే.

Leave A Reply

Your email address will not be published.