80 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

ఛండీగఢ్‌: దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌లో మూత‌ప‌డిన పాఠ‌శాల‌లు కొన్ని రాష్ట్రాల్లో ఈ మ‌ధ్య కాలంలో తెరుచుకున్న విష‌యం తెలిసిందే. అయితే హర్యానా రాష్ట్రం రేవారిలోని ఐదు ప్రభుత్వ, మూడు ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 80 మంది విద్యార్థులు మహమ్మారి బారినపడ్డారు. దీంతో ప్రభుత్వం 15 రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. అలాగే శానిటేషన్‌ పనులు చేపట్టాలని సూచించింది. నవంబర్‌ 2న ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాఠశాలల్లో కరోనాకు పాజిటివ్ పరీక్షలు చేయడంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ యషేంద్ర సింగ్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్‌కుమార్‌ను ఆదేశించారు. కరోనా సోకిన విద్యార్థులు ఉన్న పాఠశాలలను రాబోయే 15 రోజులు మూసివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.