గోంగూర – ఔషధగుణాలు
మనం రోజు చూచే గోంగూర ఒక ఉన్నతమైన ఆహరం . శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి ముక్కలుగా తుంచి నేతి పోపు లేదా నువ్వుల నూనెతో పోపు వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి,కొద్దిగా దాల్చిన చెక్క పొడి ఉప్పు వేసి నీరు పోసి సూప్ తయారు చేయాలి ఇది టి.బి వలన వచ్చే ఎముకల జ్వరం రాకుండా కాపాడుతుంది కిడ్నీలను శుభ్రం చేసి మూత్రాన్ని జారీ చేస్తుంది . గోంగూర మొగ్గలను నీటిలో మరిగించి కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే దగ్గు తగ్గి పోతుంది. అందులో తేనే కూడా కలిపి తాగితే వాంతులు కూడా తగ్గి పోతాయి.
– పి . కమలాకర్ రావు