30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో పని దినాలను కుదించారు. ఈ సెషన్‌లోనే 11 చట్టాల్లో సవరణలు, 3 ఆర్డినెన్స్‌ల బిల్లులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగడతాయేనని చూడాలి. అటు ప్రతిపక్షాలను అధికార పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.