గ్రేటర్ ఫైట్‌: రేపే ఆఖరు తేదీ

హైద‌రాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది. నిన్నటి రోజున కేవలం 20 నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. నామినేషన్ల ప్రక్రియకు రేపు ఆఖరు తేదీ కావడంతో ఈరోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నది. గ్రేటర్ పరిధిలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటుగా మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లోకి అనుమతి ఉంటుంది. ఈరోజు రేపు పెద్ద సంఖ్యలో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నవంబర్ 21 వ తేదీన నామినేషన్ల పరిశీలనా, 22 న ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 1 వ తేదీన ఎన్నికల నిర్వహణ ఉండగా, డిసెంబర్ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.