గ్రేటర్ ఫైట్: పోస్టల్ బ్యాలెట్ న్యూ రూల్స్!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్న సంగతి విధితమే. రేపటితో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుండగా… 21న నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల పరిశీలన, 23వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ఇక, గ్రేటర్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను విడుదల చేసింది. నవంబర్ 1వ తేదీ తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలిన వారికి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ఈసీ. అదేవిధంగా సైనిక సంస్థల్లో సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, దివ్యాంగులు, 80 ఏళ్లుపైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ వీలు కల్పిస్తూ నిబంధనలు విడుదల చేసింది ఎన్నికల సంఘం.