10 నిమిషాల్లో రూ.12 కోట్లు చోరీ!

ఒరిస్సా: ఇప్పటి వరకూ ఒరిస్సాలో జరిగిన చోరీలతో పోలిస్తే ఇది కాస్త ప్రత్యేకంగా కనిపిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం కటక్‌ పట్టణంలోని ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ నయాసరక్‌ బ్రాంచ్‌లోకి గురువారం నలుగురు దొంగలు మాస్కులు, హెల్మెట్లు ధరించి చొరబడ్డారు. అందులో ఒక దొంగ సెక్యూరిటీ గార్డ్‌ తలపై గన్‌పెట్టి బెదిరించాడు. మిగిలిన ముగ్గురు కలిసి బ్రాంచ్‌ మేనేజర్‌ను, మిగిలిన సిబ్బందిని చుట్టుమాట్టారు. లాకర్‌ తాళాలను లాక్కున్నారు. దొరికిందే అదునుగా మొత్తం బంగారాన్ని (సుమారు రూ.12కోట్లు విలువ చేసే)తీసుకుని ఉడాయించారు. దీనిపై బ్రాంచ్‌ మేనేజర్‌ సత్యప్రదాన్‌ మాట్లాడుతూ కేవలం 10 నిమిషాల్లో అంతా జరిగిపోయిందని, ఈ ఘటన తమను షాక్‌కు గురిచేసిందని అన్నారు. దొంగలు బ్యాంకులోకి వచ్చే సమయానికి సిసిటీవీలు సక్రమంగా పనిచేయడం లేదని విచారం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కటక్‌ డిసిపి ప్రతీక్‌ సింగ్‌ మాట్లాడుతూ దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. నగరం సరిహద్దుల్లో కాపు కాస్తున్నామని, జగత్‌సింగ్‌పూర్‌, జజ్‌పూర్‌, ఢెంకనల్‌, కెంద్రపర పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నామన్నారు.

Leave A Reply

Your email address will not be published.