కారును ఢీకొట్టిన లారీ: ఏడుగురు దుర్మ‌ర‌ణం

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లో ఈరోజు (శ‌నివారం) ఉద‌యం సురేంద్ర‌న‌గ‌ర్ జిల్లా ప‌త్డి ఏరియాలో ఎదురెదురుగా వ‌చ్చిన కారు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో కారులో ఉన్న ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. కారు పూర్తిగా ధ్వంస‌మ‌వ‌గా, డంప‌ర్ ముందు భాగం స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్న‌ది. స‌మాచారం అందుకున్న పోలీసులు మృతదేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ప‌రారీలో ఉన్న డంప‌ర్ డ్రైవ‌ర్ కోసం గాలింపు చేప‌ట్టారు. కాగా, గుజ‌రాత్‌లో గ‌త మూడు రోజుల వ్య‌వ‌ధిలో ఇలాంటి ప్ర‌మాదం చోటుచేసుకోవ‌డం ఇది రెండోసారి. గ‌త బుధ‌వారం వ‌డోద‌ర‌లో ఎదురెదురుగా వెళ్తున్న రెండు ట్రక్కులు ఢీకొని 11 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

 

Leave A Reply

Your email address will not be published.