బిజెపిని చూసి భయపడుతోంది:బండి సంజయ్

హైదరాబాద్ : తెలంగాణాలో బిజెపిని చూసి టిఆర్‌ఎస్ భయపడుతోందని, తమను ఆపేశక్తి ఆ పార్టీకి లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు విమర్శించారు. శనివారం ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ… వరదసాయంపై తాను ఈసీకి లేఖ రాయలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించారు. వరద సాయంపై తమకు ఎలాంటి లేఖ అందలేదని స్వయంగా ఎస్‌ఈసీనే చెప్పారని అన్నారు. ఇదంతా టిఆర్‌ఎస్ కుట్రేనని, తాము వాస్తవాలు చెప్పినా టిఆర్‌ఎస్ నాయకులు దుష్ప్రచారం ఆపలేదని అన్నారు. తెలంగాణా ప్రజల్లో చైతన్యం వస్తోందని, వాళ్లు ఏం చేయాలో అది చేస్తారని పేర్కొన్నారు. తాము గెలిస్తే వరద సాయం రూ.25వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. చైనాకు అనుకూలంగా కెసిఆర్ వ్యాఖ్యలు చేయడం దేశద్రోహం కాదా అని ప్రశ్నించారు.