ఏపీలో కొత్తగా 545 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా ఎపి ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 862758కి చేరింది. ఇందులో 842416 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 13394 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6948కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 19, చిత్తూరు 32, తూర్పుగోదావరి జిల్లాలో 104, గుంటూరు 117, కడపలో 31, కృష్ణాలో 44, కర్నూలులో 10, నెల్లూరు 30, ప్రకాశంలో 25, శ్రీకాకుళంలో 19, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 76 కేసులు నమోదయ్యాయి.